టెస్లా ఇంక్ కంపెనీకి చైనా రెండవ అతిపెద్ద మార్కెట్ గా ఉంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో మూడింట రెండు వంతులు చైనాలోనే అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో చైనాలో టెస్లాకు ఉన్న పోటీ గురించి మస్క్ మాట్లాడారు. చైనాలోని కార్ కంపెనీలను తాను గౌరవిస్తానని, ఇది ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వ మార్కెట్ అని పేర్కొన్నాడు. చైనీస్ వాహన తయారీదారులలు కష్టపడి పనిచేస్తారని, తెలివిగా పని చేస్తారని మస్క్ చెప్పాడు. టెస్లాకు రెండవ స్థానంలో చైనా నుండి ఏదైనా కంపెనీ ఉండొచ్చని మస్క్ అంచనా వేశాడు.