మెక్సికోలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. జెరెజ్ టౌన్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు పెద్ద సంఖ్యలో ఆయుధాలతో రెండు వాహనాల్లో ఎల్‌వానాడిటో నైట్‌క్లబ్‌కు చేరుకొని, అక్కడున్న జనంపై కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు.