చెల్లిపై అక్క లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన మహారాష్ట్ర పూణె జిల్లాలో చోటుచేసుకుంది. 24 ఏళ్ల అక్క ఉన్నత విద్యావంతురాలు. ఆమెకు వివాహం జరిగింది. కొద్ది రోజులుగా విమానగర్ ప్రాంతంలో అక్కతో పాటు 18 ఏళ్ల చెల్లి కలిసి ఉంటోంది. ఈనెల 23న చెల్లి హాలులో నిద్రిస్తుండగా, అక్క వచ్చి లైంగికంగా వేధించింది. చెల్లి ఎంత వారిస్తున్నా వినలేదు. దీంతో చెల్లి తన అక్కపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.