ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనదారులకు శుభవార్త.. ప్రమాదాల నివారణకు యాప్‌

Technology |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:27 PM

రోడ్డు ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు ఓ యాప్‌ను అభివృద్ధి చేశారు. ప్లైఓవర్లపై జరిగే ప్రమాదాలను ముందుగానే తెలుసుకుని వాహన డ్రైవర్ ను అలెర్ట్ చేసే ఓ యాప్‌ అందుబాటులో తీసుకువస్తున్నారు. వాహనాల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రూపొందిన స్మార్ట్‌ఫోన్లు వంతెనను దాటేటప్పుడు ఆ వంతెన నిర్మాణానికి సంబంధించిన సమగ్ర డాటాను సేకరించి, వాహనదారుడికి ఆ యాప్‌ ద్వారా తెలియజేస్తుంది. బ్రిడ్జిలో ఎలాంటి లోపమున్నా.. వెంటనే వాహనదారుడి మొబైల్‌ ఫోన్‌కు నోటిఫికేషన్‌ను పంపుతుంది. ఈ యాప్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com