థాయిలాండ్‌లో ఓ బౌద్ధ ఆలయం ఖాళీగా మారింది. సాధారణంగా బౌద్ధ ఆలయాల్లో సన్యాసులు ఉంటారు. వాళ్లు ప్రత్యేకమైన జీవన విధానాన్ని కలిగి ఉంటారు. కనీసం మాంసాహారాన్ని కూడా ముట్టుకోరు. పళ్లు, కూరగాయలు తింటూ కాలం గడుపుతారు. అలాంటి సన్యాసులు ప్రతి బౌద్ధ ఆలయాల్లోనూ ఉంటారు. అయితే సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని ఒక బౌద్ధ దేవాలయం మాత్రం ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఎందుకంటే అక్కడ సన్యాసులు డ్రగ్ టెస్ట్‌లో విఫలమయ్యారు.
ఆ గుడిలోని సన్యాసులందరూ డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దాంతో వారిని డీఫ్రాక్ చేశారని స్థానిక అధికారి ఒకరు తెలిపినట్టు ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. డీఫ్రాకింగ్ అంటే సదరు మంత్రిత్వ శాఖ విధులను నిర్వర్తించడం కోసం నియమించిన వారిని, ఆ పదవుల నుంచి తొలగించడం.
ఫెట్చాబున్ రాష్ట్రం, బంగ్ సామ్ ఫాన్ అనే జిల్లాలోని ఒక ఆలయంలో ఉన్న ఒక మఠాధిపతి సహా నలుగురు సన్యాసులకు డ్రగ్స్ పరీక్ష చేశారు. వారంతా మత్తుపదార్థాలు తీసుకున్నట్టు తేలింది. వారంతా మాదక ద్రవ్యాలకు బానిసలైనట్టు గుర్తించారు. దాంతో ఆ మాదక ద్రవ్యాల బారిన నుంచి బయట పడేయడం కోసం వారిని ఆస్పత్రికి పంపించినట్టు స్థానిక అధికారి తెలిపారు. దాంతో ఆలయంలో ప్రస్తుతం సన్యాసులు ఎవరూ లేరని, అయితే బౌద్ధాలయం ఖాళీగా ఉండడం.. ఎటువంటి పూజలు నిర్వహించకపోవడంతో.. స్థానికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. తర్వలోనే ఆలయానికి కొత్త సన్యాసులను నియమిస్తామని స్థానిక అధికారి తెలిపారు. మయన్మార్ నుంచి లావోస్ వచ్చే మెథాంఫేటమిన్ మాదక ద్రవ్యానికి ప్రధాన రవాణా మార్గం థాయిలాండ్. అక్కడ నుంచే వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా జరుగుతుందని డ్రగ్స్ అండ్ క్రైమ్‌పై ఐక్యరాజ్యసమితి కార్యాలయం ఓ సందర్భంలో వెల్లడించింది.
![]() |
![]() |