ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయనకు 78....అమెకు 76....వారిద్దరు ఇష్టపడ్డారు

international |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 12:19 AM

ప్రేమకు వయస్సుతో సంబంధంలేదు అంటారు. అదే నిజమేనని ఇటీవల చోటు చేసుకొంటున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి. పెళ్లి అంటే ఎవరైనా ఆలయంలోనో.. చర్చిలోనో.. గ్రాండ్‌గా పెళ్లి మండపంలో చేసుకుంటారు. కానీ ఓ జంట కిరాణా దుకాణంలో వివాహం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్లు మొదటిసారి అక్కడే కలిశారంట. దానికి చిహ్నంగా అక్కడే ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆ షాపులోనే పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయబద్ధంగా చర్చిలో జరిగిన తంతు మొత్తం అక్కడ జరిగింది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. పెళ్లి కొడుకుకు.. 78 ఏళ్లు... పెళ్లి కూతురుకి 76 ఏళ్లు.


వృద్ధులైన బ్రెండా విలియమ్స్, డెన్నిస్ డెల్గాడో  2021లో అమెరికాలోని కాసా గ్రాండేలోని ఓ స్టోర్‌లో ఒకరినొకరు కలుసుకున్నారు. తర్వాత వారి మధ్య పరిచయం పెరిగింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇంకేముంది డేటింగ్ ప్రారంభించారు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి వాళ్లని కలిపిన స్టోర్‌నే పెళ్లి మండపంగా మార్చుకున్నారు. ఇంకేముంది అక్కడే ఆ వృద్ధ జంట సింపుల్‌గా వివాహం చేసేసుకున్నారు. ఈ సందర్భంగా వాళ్లు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. రెండోసారి తమకు జీవితం ప్రారంభమైందని ఆనందపడ్డారు.


బ్రెండా, డెన్నిస్ డెల్గాడోలకు ఇద్దరికి ఇది రెండో వివాహమే. బ్రెండా తన భర్తను 30 ఏళ్ల క్రితమే కోల్పోయింది. అప్పటి నుంచి దేవుడిపై నమ్మకంతో అలా ఉండిపోయింది. దానికి ఆమె ఎప్పుడు దేవుడిని నిందించలేదంట. అలాగే డెన్నిస్ భార్య కూడా మరణించింది. అయితే తన భార్యను దూరం చేసినందుకు డెన్నిస్ దేవుడిపై కోపంగా ఉండేవాడంట. అయితే ఇప్పుడు దేవుడికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నానని డెన్నిస్ అంటున్నాడు. బ్రెండాతో కొత్త బంధం ఏర్పడడమే దానికి కారణం. అలా మొత్తానికి ఆ వృద్ధ జంట.. ఒక్కటయ్యారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com