ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యాలోనూ పుష్పా...ఊపేయనున్నదా

international |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 07:27 PM

మనదేశంలోనే కాకుండా విదేశాలల్లో ఓ ఊపు ఊపిన పుష్ప చిత్రం తాజాగా రష్యా దేశంలోకి ఎంట్రీ ఇస్తోంది. గతేడాది డిసెంబరు 17న విడుదలైన 'పుష్ప' చిత్రం బాక్సాఫీసు వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టయినర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 వేల థియేటర్లలో రిలీజై రూ.300 కోట్లకుపైగా రాబట్టింది. ఇదిలావుంటే 'పుష్ప' చిత్రం ఇప్పుడు రష్యాలోనూ విడుదల కానుంది. 'పుష్ప ది రైజ్' చిత్రం రష్యాలో డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని రష్యా భాషలోకి డబ్ చేసి విడుదల చేస్తుండడం విశేషం. విడుదలకు ముందు డిసెంబరు 1న మాస్కోలో, డిసెంబరు 3న సెయింట్ పీటర్స్ బర్గ్ లో పుష్ప ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com