ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాలంటీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 12:42 PM

గుంటూరు నగరంలోని వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 45 వార్డు వాలెంటీర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు కమిషనర్ కీర్తి తెలిపారు. ఈనెల 31న అన్ని వార్డు సచివాలయాల్లో ఖాళీలకు సంబంధించి నోటీసు బోర్డులో వివరాలు ప్రచురించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 30కి 18 సంవత్సరాలు నిండిన వారు, 35 సంవత్సరాలు లోపు వారు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్నవారు నవంబర్ 1 నుంచి 3 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com