పుష్పతో జాతీయ స్థాయి స్టార్ గా గుర్తింపు పొందిన టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ గురువారం మధ్యాహ్నం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో కనిపించారు. భార్యాపిల్లలతో కలిసి ఆయన స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాలుపంచుకున్నారు. స్వర్ణ దేవాలయంలో అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పుష్ప-2 చిత్రం షూటింగ్‌లో బిజీబిజీగా గడుపుతున్న అల్లు అర్జున్ కాస్తంత వీలు చూసుకుని ఫ్యామిలీతో కలిసి అమృత్ సర్ వెళ్లినట్లు సమాచారం.