ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆక్టోబర్ 1 నుంచి ఆ నిబంధన అమలు: నితిన్ గడ్కరీ

national |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 09:08 PM

రోడ్డు ప్రమాదాల నివారణకు ఇటీవల కేంద్రం పలు నిర్ణయాలు తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ  క్రమంలోనే  ఇక‌పై ప్ర‌తి కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉండేలా కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన నిబంధ‌న‌ను అమ‌లులోకి తీసుకొస్తోంది. అక్టోబ‌ర్ 1 నుంచే ఈ నిబంధ‌న‌ను అమ‌లులోకి తీసుకురానుంది. ఈ మేర‌కు కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ గురువారం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇక‌పై ప్ర‌తి కారులో క‌నీసం 6 ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేన‌ని ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త దృష్ట్యా ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు. కార్ల వేరియంట్లు, ధ‌ర‌ల‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ప్ర‌తి కారులో క‌నీసం 6 ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.


ఇటీవ‌ల జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో టాటా స‌న్స్ మాజీ చైర్మ‌న్ సైర‌స్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ప్రమాద స‌మయంలో కారు వెనుక సీట్లో కూర్చున్నా... మిస్త్రీ చ‌నిపోయారు. ఈ ప్ర‌మాదంపై స‌మ‌గ్ర అధ్య‌య‌నం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం...ఇక‌పై జ‌రిగే ప్ర‌మాదాల్లో ముందు సీట్ల‌లో కూర్చున్న వారే కాకుండా వెనుక సీట్ల‌లో కూర్చున్న వారు కూడా సుర‌క్షితంగా ఉండాల‌న్న ఉద్దేశ్యంతోనే ఈ స‌రికొత్త నిబంధ‌న‌ను అమలులోకి తీసుకువ‌చ్చింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com