ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగి ఉన్న బస్సులో భారీ పేలుడు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 12:41 PM

జమ్మూ కాశ్మీర్‌ లోని ఉధంపూర్ లో వరుస పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. 8 గంటల వ్యవధిలో ఆగి ఉన్న రెండు బస్సుల్లో పేలుళ్లు సంభవించాయి. బుధవారం రాత్రి ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్న బస్సులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పేలుడు దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బంకులో పెట్రోల్ కొట్టించుకునేందుకు బస్సు అక్కడికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన 8 గంటలకే ఉధంపూర్ ​లోని మరో బస్సులో పేలుడు సంభవించింది. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది ప్రమాదం కాదని, పేలుళ్లే అని పోలీసులు నిర్ధారించారు. ఎలాంటి బాంబులను వాడారనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com