పెప్సీకో కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్పై దాడులు చేస్తున్న రష్యాకు షాక్ ఇచ్చింది. రష్యాలో పెప్సీ, 7 అప్, మౌంటెన్ డ్యూ ఉత్పత్తి, విక్రయాలు నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. రష్యా అంతటా పెప్సీ ఉత్పత్తులు నిలిచి పోయినట్లు ఆ కంపెనీ ప్రతినిధి తాజాగా ధ్రువీకరించారు. ఉక్రెయిన్పై దాడులు చేస్తే రష్యాలో ఉత్పత్తి నిలిపి వేస్తామని మార్చిలోనే పెప్సీ కంపెనీ ప్రకటించింది.