రాష్ట్రంలో తొమ్మిది విశ్వవిద్యాలయాల కులపతుల నియామకాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మానకొండూరు శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీఎం కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు.ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో దళితులకు చోటు కల్పించలేదని, ఆ లోటును భర్తీ చేయడమే కాకుండా ఎస్సీ లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో దళిత జాతి గర్వ పడుతోందంటూ ఎమ్మెల్యే కవ్వంపల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్ సమక్షంలో పొగడ్తలతో ముంచెత్తారు.