రాబోయే 10 రోజుల్లో బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టులో నీళ్లు నింపనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అలాగే కాలువల ద్వారా చెరువులు నింపేందుకుగాను ప్రభుత్వం ద్వారా కాలువల కోసం నిధులు మంజూరు చేయించినట్లు మంత్రి వెల్లడించారు.
సోమవారం ఆయన నల్గొండ జిల్లాలోని ఖాజీరామారంలో 20 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.