మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తలోకి నిలిచారు. ఆయన స్టేజీ మీద డ్యాన్స్ చేస్తు రెచ్చిపోయారు. మల్లారెడ్డి ఎప్పుడు చూసిన మాస్ ఫాలోయింగ్ తో డైలాగు లతో రచ్చ చేస్తుంటారు.పాలమ్మిన, పూలమ్మిన అంటూ ఆయన చెప్పిన డైలాగులు సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, ఆయన మరోసారి డ్యాన్స్ చేస్తు రచ్చ చేశారు.మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈనెల 27న జరగనుంది. అందులో భాగంగానే వివాహానికి స్పెషల్ కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకలో భాగంగా ఆదివారం రాత్రి సంగీత్ కార్యక్రమం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.రాత్రి జరిగిన సంగీత్ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆయన అదిరిపోయే డ్రెస్ వేసుకుని, మాస్ స్టెప్పులు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. మల్లా రెడ్డి డీజే టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తు హల్ చల్ చేశారు. ఆయన పాటకు తగ్గట్టుగా ఫెక్స్ ఎక్స్ ప్రెషన్ ఇస్తు డ్యాన్స్ చేశారు.