శనివారం పడిన భారీ వర్షాలకు నారాయణపేట మండలం బండగొండ వాగులో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను గ్రామస్తులు గమనించి కాపాడారు. వాగు దాటేందుకు ప్రయత్నిస్తున్న యువకులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న వారిని చూసి వెంటనే తాడు సహాయంతో ఓడ్డుకి చేర్చారు. భారీ వర్షాలపై ప్రతి సారి వాగు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు హై లెవల్ వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.