జగిత్యాల జిల్లాలో రెండవ విడత రూ 169 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. ఐడివోసి సమావేశ మందిరంలో మంగళవారం రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో మొదటి విడత కింద లక్ష రూపాయల రుణ మాఫీ జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాణి, జిల్లా సహకార అధికారి రఘువరన్, ఎల్డీఎం రాం కుమార్, పాల్గొన్నారు.