కుటుంబ కలహాలతో రైలుకింద పడి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్కేసర్ పరిధిలో చోటు చేసుకుంది. కాలి అయిలయ్య(65) జవహర్‌నగర్‌లోని బాలాజీనగర్‌లో ఉంటూ కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.