ఢిల్లీ రాజేంద్రనగర్లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా జిల్లాకు చెందిన తానియాసోని (25) మృతిచెందింది. ఆమె తండ్రి శ్రీరాంపూర్-1 భూగర్భ గని డీజీఎంగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియాసోని తండ్రి విజయ్ కుమార్ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. భౌతికకాయం వీలైనంత త్వరగా అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.