రామగుండం రోడ్లు భవనాల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ యం. డి జావిద్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అభివృద్ధి పనులు, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ జావిద్ ను సస్పెండ్ చేస్తున్నట్లు, సంబంధిత ఇంజనీర్ పై విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.