సంగారెడ్డి పట్టణ మహబూబ్ సాగర్ చెరువు సమీపంలోని పురాతన సోమేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శివలింగానికి మాన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని జరిపించారు. అర్చకులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి మంగళ హారతులు, మహా నైవేద్యాన్ని సమర్పించారు.