కొమురం భీం జిల్లా తిర్యాణి గ్రామ పంచాయతీకి చెందిన రెండు స్పోర్ట్స్ కిట్లు చోరీకి గురైనట్లు పంచాయతీ కార్యదర్శి అంజయ్య తెలిపారు. ఈమే రకు బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పంచాయతీకి చెందిన క్రీడా సామగ్రిని కుమురం భీం కమిటీ హాల్లో భద్రపరిచామని, బుధవారం వెళ్లి చూడగా అక్కడ లేవని గుర్తించామన్నారు. ఇటీవల గుర్తు తెలియని వారు కిటికీలో నుంచి దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.