చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల మేడిపల్లి సత్యం సతీమణి రూపదేవి ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఈ క్రమంలోనే భార్య మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని కలిసిన కేటీఆర్ వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా రూపదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు వివేకానంద్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఉన్నారు. ఇక ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మేడిపల్లి సత్యం ఇంటికి వెళ్లి మరీ ఓదార్చారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా మేడిపల్లి సత్యంను పరామర్శించారు.