ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డ కేటీఆర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 03:54 PM

ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీఎక్కితే ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారెంటీ అంటూ కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మోసం..వంచన.. ద్రోహం.. దోఖాలమయం కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలనంతా..! ఇది..మీ కపట కథలు..కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ..! కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవ్ ఇక్కడ..! రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దవడం గ్యారెంటీ..! కాలకేయుల కాలం వస్తే కరెంట్‌ కోతలు..కటిక చీకట్లు గ్యారెంటీ..! మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతి..ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ..! దగాకోరుల పాలనొస్తే ధరణి రక్షణ ఎగిరిపోవడం గ్యారెంటీ..! బకాసురులు గద్దెనెక్కితే రైతుబీమా..ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ..! సమర్థతలేని సన్నాసులకు ఓటేస్తే సకల రంగాల్లో సంక్షోభం గ్యారెంటీ..! ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీఎక్కితే ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారెంటీ..! దొంగల చేతికి తాళాలు ఇస్తే సంపదనంతా స్వాహా చేయడం గ్యారెంటీ..! భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే బూడిద మిగలడం గ్యారెంటీ...! స్కాముల పార్టీకి స్వాగతం చెబ్తే స్కీములన్ని ఎత్తేయడం గ్యారెంటీ..! కర్షకుడి కష్టం తెలియనోళ్లకు సీటిస్తే అన్నదాత ఆగమైపోవడం గ్యారెంటీ..! పరిపాలన చేతగాని..చేవలేనివాళ్లకు పగ్గాలిస్తే పల్లెపల్లెనా మళ్లీ పల్లేర్లు మొలవడం గ్యారెంటీ..! పనికిమాలిన వాళ్లు పవర్‌లోకి వస్తే పరిశ్రమలు పారిపోవడం గ్యారెంటీ..! బుద్ధికుశలత లేనోళ్లకు చోటిస్తే భూముల ధరలు పడిపోవడం గ్యారెంటీ..! విషయం..విజ్ఞానం లేనోళ్లను విశ్వసిస్తే వికాసం మాయమై వినాశనం గ్యారెంటీ..! థర్డ్ గ్రేడ్ నాలాయక్స్ ను నమ్ముకుంటే ప్రథమ స్థానంలో వున్న స్టేట్ అధమస్థాయికిపోవడం గ్యారెంటీ..! ఆర్థికశాస్త్రం తెలియని అరాచకులకు అవకాశం ఇస్తే ఎకానమీ ఏట్లో గలవడం గ్యారెంటీ..! జోకర్లకు..బ్రోకర్లకు పీఠం ఇస్తేపరువు ప్రతిష్ఠలు గంగలో కలవడం గ్యారెంటీ..! దాచి..దాచి దెయ్యాలకు పెట్టేంత ఎడ్డిది కాదు..నా తెలంగాణ..! ఈనగాచి నక్కల పాల్జేసేంత అమాయక నేల కాదు నా తెలంగాణ..!’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com