తెలంగాణలో మరో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నార్లాపూర్ వద్ద తొలి పంపు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. 130 మీటర్ల లోతు నుంచి కృష్ణమ్మ ఉబికి వచ్చింది. ఈ ప్రాజెక్టులో బాహుబలి కంటే బలమైన 34 మోటార్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కో పంపు సామర్థ్యం 145 మెగావాట్లు. ప్రాజెక్టు విద్యుత్ అవసరాల కోసం 4 చోట్ల 400/11 కేవీ సబ్ స్టేషన్లను నిర్మించారు. మొత్తం రూ. 2155.17 కోట్ల వ్యయంతో భారీ విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేశారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని మోటార్లు ఎత్తిపోస్తాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాలకు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం