మణిపుర్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఇవాళ 100 మందిని ఇంఫాల్ నుంచి హైదరాబాద్ తరలించారు. సోమవారం మధ్యాహ్నం ఇంఫాల్ నుంచి తొలి విమానం శంషాబాద్ చేరుకుంది. అక్కడ చిక్కుకున్న విద్యార్థుల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి.