ఓయూ పీహెచ్డీ ప్రవేశాల వివాదం చినికి చినికి గాలి వానగా మారుతొంది. యుజీసి నిబంధనలే ప్రమాణికం అంటున్నా ఓయూ విసి ప్రొఫెసర్ రవీందర్ తన మాటపై ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో బహిరంగ చర్చకు రావాలని విద్యార్థులు సవాల్ చేసిన నేపథ్యంలో ముందుగా చెప్పిన సమయానికి విద్యార్థులు అక్కడికి చేరుకుని ఎదురు చూశారు. ఈ సందర్భంగా విద్యార్థులు విసీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తక్షణమే వీసిని రి కాల్ చేయాలని డిమండ్ చేశారు.