మహేష్‌బాబు తన కొత్త చిత్రం కోసం సెట్లోకి అడుగుపెట్టి చాలా రోజులైంది. ఏకధాటిగా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటిదాకా ఆ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలేవీ విడుదల చేయలేదు. మహేష్ కొత్త సినిమాలో ఎలా కనిపిస్తాడో అని మరోపక్క అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా పేరు గురించీ అభిమానుల్లో పెద్దఎత్తున చర్చ సాగుతోంది. అందుకే చిత్రబౄఎందం త్వరలోనే ఫస్టలుక్ని విడుదల చేయాలని నిర్ణయించింది. శుక్రవారమే మహేష్ లుక్‌ని విడుదల చేయడంతో పాటు, పేరునీ ప్రకటిస్తారని ప్రచారం సాగింది. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఫస్టలుక్ విడుదలని వాయిదా వేసింది చిత్రబౄందం. ఆ సినిమాకి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్న సంతోష్ శివన్ ట్విట్టర్ ద్వారా శుక్రవారం మహేష్ లుక్‌ని బయటపెట్టారు. అందులో మహేష్ కనిపిస్తున్న విధానం ఆసక్తికరంగా ఉంది. అదే లుక్‌ని ప్రస్తావిస్తూ వచ్చేస్తున్నాడు... అంటూ మురుగదాస్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. మహేష్, రకుల్పత్ సింగ్ జంటగా నటిస్తున్న ఆ చిత్రాన్ని జూన్ 23న తెలుగు, తమిళంతో పాటు, హిందీలోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు.