ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓపెన్ అయ్యిన 'డార్లింగ్' ఓవర్సీస్ బుకింగ్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2024, 12:30 PM

అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి డార్లింగ్‌ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ప్రీమియర్స్ జులై 18న విడుదల కానుంది. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ అండ్ నిర్వాణ సినిమాస్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌లో నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి శ్రీమతి చైతన్య సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై 19న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com