ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఫ్యామిలీ స్టార్' నుండి మధురము కదా సాంగ్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 02:36 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి "ఫ్యామిలీ స్టార్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మూడవ సింగిల్ ని మధురము కదా అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎమోషనల్ మూమెంట్స్‌తో కూడిన సాధారణ ఫ్యామిలీ డ్రామా అని లేటెస్ట్ టాక్. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com