ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇమ్రాన్ హష్మీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'G2' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 02:22 PM

టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్ మరియు దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి బ్లాక్ బస్టర్ గూడాచారి సీక్వెల్ G2 కోసం చేతులు కలిపారు. జనవరిలో ప్రకటించిన ఈ సినిమా అధికారికంగా ఇటీవలే ప్రారంభించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్ హష్మీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది.

బనితా సంధు కథానాయికగా నటించనున్న ఈ స్పై థ్రిల్లర్‌కు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై టిజి విశ్వ ప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com