ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బజ్ : 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌' లో లియో నటి

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2024, 08:14 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ సినిమాకి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T.) అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, గతంలో విజయ్ సరసన లియో చిత్రంలో నటించిన త్రిష కృష్ణన్ ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో విజయ్ సరసన హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కలాపతి, కళపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కళపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com