ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెడ్ శారీలో కాజల్ మెరుపులు

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 07, 2024, 11:26 AM

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. గత ఏడాది కాజల్ అగర్వాల్.. బాలయ్య భగవంత్ కేసరి చిత్రంతో హిట్ అందుకుంది. ప్రస్తుతం కాజల్ పలు చిత్రాల్లో నటిస్తోంది. కాజల్ లాంటి స్టార్ సెలెబ్రిటీ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. కొందరైతే ఆకతాయి తనంగా బిహేవ్ చేసి నటీమణులని ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా అలాంటి సంఘటనే కాజల్ కి ఎదురైంది. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఓ షాపింగ్ మాల్ లాంచ్ కి గెస్ట్ గా హాజరైంది. వస్త్రాల బ్రాండ్ కి సంబందించిన షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం కాజల్ రెడ్ శారీలో క్రేజీగా కనిపించింది. కాజల్ వస్తోందని తెలియడంతో ఫ్యాన్స్ అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఓ అభిమాని కాజల్ తో అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com