ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మంగళవరం' మొదటి సింగల్ విడుదలకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 12, 2023, 08:51 PM

దర్శకుడు అజయ్ భూపతి గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మంగళవరం' అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్, టీజ‌ర్‌కి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఇప్పుడు ఈ విలేజ్ థ్రిల్లర్ మొదటి సింగిల్ గాన గంగా మొగలిరా ఆగస్టు 16న విడుదలవుతుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ గోష్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. విలేజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకి కాంతారావు ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఎ క్రియేటివ్ వర్క్స్ మరియు ముద్ర మీడియా వర్క్స్ పతాకాలపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com