క్రేజీ హీరోయిన్ సమంత నుండి రాబోతున్న మరొక పాన్ ఇండియా మూవీ "శాకుంతలం". గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో దేవ్ పటేల్, మోహన్ బాబు, అల్లు అర్హ కీరోల్స్ లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
గతేడాది ఆగస్టులోనే విడుదల కావలసిన శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. అటు తరవాత కూడా మరోసారి విడుదల తేదీని వాయిదా వేసుకున్న శాకుంతలం చిత్రబృందం ఈ సారి మాత్రం ఏప్రిల్ 14న ఖచ్చితంగా సినిమాను విడుదల చేసి తీరుతామని అఫీషియల్ రిలీజ్ డేట్ పోస్టర్ తో ప్రేక్షకులకు సాలిడ్ క్లారిటీ ఇచ్చారు.