ఫిబ్రవరి 17వ తేదీన తెలుగు, తమిళ భాషలలో విడుదలైన "సార్ / వాతి" మూవీ, వరల్డ్ వైడ్ గా 100కోట్ల భారీ కలెక్షన్లు సొంతం చేసుకుని, హీరో ధనుష్ కి తెలుగులో అదిరిపోయే వెల్కమ్ పలికింది. ఈ సినిమాకు తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి వన్ లైఫ్ అనే వీడియో సాంగ్ విడుదలయ్యింది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ గీతాన్ని హేమచంద్ర, ప్రణవ్ ఆలపించారు. ప్రణవ్ చాగంటి లిరిక్స్ అందించారు.