బ్రహ్మానందం.. ఆ పేరు వింటేనే ముఖాలపై చిన్న చిరునవ్వు వస్తుంది. అంతలా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయిన కమెడియన్ బ్రహ్మానందం గారు. ఫిబ్రవరి 1, 1956లో సత్తెనపల్లిలో జన్మించిన కన్నెగంటి బ్రహ్మానందం ఈ రోజు 67వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అశేష ప్రేక్షకలోకం హాస్యబ్రహ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటూ, మరిన్ని మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటున్నారు.