ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"సైOధవ్" టైటిల్ తో వెంకీ 75 పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్ ఔట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 11:17 AM

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గారి ల్యాండ్ మార్క్ మూవీ 'వెంకీ 75' అధికారిక ప్రకటన రీసెంట్గానే జరగ్గా, తాజాగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ కాసేపటి క్రితమే మేకర్స్ స్పెషల్ గ్లిమ్స్ వీడియో విడుదల చేసారు. హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్షన్లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.



పోతే, ఈ సినిమాకు "సైoధవ్" టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు. పాన్ ఇండియా భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. DOP : మణికందన్, ఎడిటింగ్ : గారి BH. అతి త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతుందని మేకర్స్ ప్రకటించారు.


ఇక, తాజాగా విడుదలైన గ్లిమ్స్ లో వెంకటేష్ ఫియర్స్ అవతార్, రగ్డ్ లుక్ సూపర్బ్ గా ఉంది. ఒక చేత్తో తుపాకీ, మరొక చేత్తో ఏదో ఒక ప్రత్యేకమైన మందు (వాక్సిన్, డోస్) పట్టుకుని, రమ్మను.. నేనిక్కడే ఉంటా అని రౌడీలకు చెప్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com