ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తికేయ 'బెదురులంక 2012' పై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 16, 2023, 11:15 AM

యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న కొత్త చిత్రం "బెదురులంక 2012". రీసెంట్గానే ఈ మూవీ నుండి చిన్న గ్లిమ్స్ వీడియో విడుదలై సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది.


తాజాగా ఈ సినిమా నుండి హీరో హీరోయిన్లు కలిసి ఉన్న న్యూ పోస్టర్ విడుదలైంది. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్లో హీరో హీరోయిన్లు రొమాంటిక్ స్టిల్ లో కనిపిస్తున్నారు.


డీజే భామ నేహశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు క్లాక్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.  కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com