నిధి అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటి. హిందీ, తెలుగు చిత్రాలలో నటించింది.1993, ఆగస్టు 17న హైదరాబాద్‌లోని హిందీ మాట్లాడే మార్వారీ కుటుంబంలో జన్మించి బెంగళూరులో పెరిగిన నిధి అగర్వాల్ కు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ప్రావీణ్యం ఉంది.ముంబై మోడల్‌గా పనిచేసి ఈ భామ తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. తాజాగా ఈమె దిగిన ఫోటోల్లో నిధి అగర్వాల్ కాస్త ఒళ్లు చేసినట్టు కనపడుతోంది.ఇక నెటిజన్స్ కూడా నిధి అగర్వాల్ కూడా తమిళ తంబీల టేస్ట్‌కు తగ్గట్టు మారిపోయినట్టు చెప్పుకుంటున్నారు.నిధి అగర్వాల్‌కు తెలుగులో మంచి హిట్ ఇచ్చిన సినిమా ఏదైనా ఉందంటే.. అది ఇస్మార్ట్ శంకర్ అనే చెప్పాలి. అయితే ఈ అమ్మడుకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో ఇప్పుడు ఈ భామ తెలుగు కంటే ఎక్కువగా తమిళంలో బిజీగా మారింది.ఇండస్ట్రీలో కొనసాగాలంటే.. అందం అనేది చాలా ముఖ్యమని చెప్పింది నిధి. అందం ఉంటేనే సినిమాలు చేయగలమని.. అందంతో పాటు ఎక్స్పోజింగ్ చేస్తుంటూనే అవకాశాలు వస్తాయని నిధి సంచలన వ్యాఖ్యలు చేసింది.
Looking for a Sundar and Susheel ladka pic.twitter.com/n7Rh19Y3hH
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) November 29, 2021