ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి గొంతు సవరించుకున్న...  కోలీవుడ్ స్టార్ హీరో ..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 08, 2022, 11:33 AM

శర్వానంద్ , రీతూవర్మ జంటగా శ్రీ కార్తీక్ డైరెక్షన్లో తెరకెక్కిన "ఒకే ఒక జీవితం" సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ శివకుమార్ ఒక పాటను పాడిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళం రెండు భాషలలో కార్తీనే ఆలపించి, ఆ పాటకు స్టెప్స్ వేశారు.


తాజా సమాచారం ప్రకారం, ఇప్పుడు మరోసారి కార్తీ గొంతు సవరించుకోబోతున్నాడని తెలుస్తుంది. ఐతే, ఈ సారి తన అప్ కమింగ్ మూవీ "సర్దార్" లో కార్తీ ఒక పాటను పడబోతున్నారని తెలుస్తుంది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. yerumayileri అనే ఈ రూరల్ ఫోక్ ట్రాక్ ను థియేటర్లో కార్తీ గొంతుతో వింటే మరింత అద్భుతంగా ఉండబోతుందని తెలుపుతూ, స్టూడియోలో కార్తీ పాడుతున్నప్పుడు తీసిన ఫోటోను షేర్ చేసారు.


PS మిత్రన్ డైరెక్షన్లో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రాశిఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com