నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ "దసరా" నుండి బిగ్ అప్డేట్ వచ్చేసింది. దసరా రోజున అంటే అక్టోబర్ ఐదవ తేదీన దసరా సినిమా ఫస్ట్ సింగిల్ 'ధూమ్ ధామ్ దోస్తానా' విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ, నాని స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు. ఇందులో ధూమ్ ధామ్ దోస్తానా సాంగ్ ను మాస్సీఎస్ట్, లోకల్ స్ట్రీట్ సాంగ్ ఎవర్ అని నాని పేర్కొనడం పాటపై మంచి అంచనాలను ఏర్పరిచింది.
కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో పక్కా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.