రాకేష్ శశి డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం "ప్రేమ కాదంట". ఇందులో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ "ఊర్వశివో రాక్షసివో" గా మారిందని తెలుపుతూ మరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసారు. మూవీ టీజర్ ను సెప్టెంబర్ 29వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు అప్డేట్ ఇచ్చారు.
శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.