సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు మూడుమూళ్ల బంధంతో తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. నయన్, విఘ్నేశ్ ప్రేమ, పెళ్లి డాక్యుమెంటరీ రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ పేరుతో దీనిని తీసుకురానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది.