ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న "కృష్ణ వ్రింద విహారి"

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 05:39 PM

నాగశౌర్య, షెర్లీ సెటియా జంటగా నటించిన చిత్రం "కృష్ణ వ్రింద విహారి". ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు నిన్ననే థియేటర్లలో విడుదలై, సూపర్ హిట్ టాక్ అందుకుంది. చూసిన ప్రేక్షకులతో పాటు, విమర్శకులు కూడా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామిని లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కృష్ణ వ్రింద విహారి పోస్ట్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకున్న సోనీ లివ్ ఓటిటిలో ఇంకొన్ని వారాల్లో స్ట్రీమింగ్ కానుంది.
అనీష్ R కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. బాలీవుడ్ హీరోయిన్ షెర్లీ సెటియా ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మూలుపురి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com