ఎట్టకేలకు విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్నారు. రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ద్వారా వీరు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫిక్స్ ఈ సిరీస్ను రూపొందిస్తోంది. యాక్షన్, క్రైమ్ నేపథ్యంలో ఈ సిరీస్ రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా రానా నాయుడు సినిమాకు సంబంధించి టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.