ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయంత్రం నాలుగింటికి సుధీర్ బాబు "హంట్" టీజర్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 12:39 PM

"ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" సినిమాతో ఇటీవలే టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన నైట్రో స్టార్ సుధీర్ బాబు కొన్ని నెలల వ్యవధిలోనే మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అదే సుధీర్ పదహారవ సినిమా 'హంట్'.
ఈ సినిమా నుండి కీలకపాత్రల క్యారక్టర్ పోస్టర్లను రివీల్ చేస్తూ వచ్చిన మేకర్స్ హీరో సుధీర్ బాబు క్యారెక్టర్ పోస్టర్ ను కూడా రివీల్ చేసి, అలానే టీజర్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారు. సుధీర్ ఈ సినిమాలో 'అర్జున్ ప్రసాద్' అనే  పాత్రలో నటిస్తున్నారు. పోతే, టీజర్ రిలీజర్ అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 04:05 గంటలకు ఇవ్వబోతున్నట్టు తెలిపారు.
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని మహేష్ డైరెక్ట్ చేస్తుండగా, సీనియర్ హీరో శ్రీకాంత్, కోలీవుడ్ హీరో భరత్ నివాస్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com