ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అందమైన మనసులో' పాట లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 12:45 PM


పల్లవి:
అందమైన మనసులో ఇంత అలజడెందుకో.. ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో అసలెందుకో అడుగెందుకో
మొదటిసారి ప్రేమ కలిగినందుకా

చరణం 1:
అక్షరాలు రెండే లక్షనాలు యెన్నో ఏమని చెప్పాలి నీతో
ఒక్క మాట అయిన తక్కువేమి కాదే ప్రేమకు సాటేమి లేదే
రైలు బండి కూతే సన్నై పాట కాగ రెండు మనసులొక్కటయేనా
కొయిలమ్మ పాటే మది మీటుతున్న వేళ కాలి మువ్వ గొంతు కలిపెనా

చరణం 2:
ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి ఒడిలో చేరిందా ప్రేమ
కంటి చూపుతోనే కొంటె సైగ చేసి కలవర పెడుతోందా ప్రేమ
గాలిలాగ వచ్చి యెద చేరేనేమో ప్రేమ.. గాలి వాటు కాదే మైనా
ఆలయాన దైవం కరుణించి పంపేనమ్మ అందుకోవె ప్రేమ దీవెనా







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com