టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'హరిహరవీరమల్లు' సినిమాలోని పవర్ గ్లాన్స్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. ఈ పాన్ ఇండియా మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల కానుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. పవర్ గ్లాన్స్ వీడియోలో మెడలు వంచి, కథలను మార్చేస్తూ, ఏం చేస్తున్నారో తెలిసేలా చేసే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఆకట్టుకుంది.