ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్ కు దక్కిన అరుదైన గౌరవం

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 22, 2022, 01:45 PM

ఉళగనాయగన్ కమల్ హాసన్ ఇటీవలే "విక్రమ్" సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. జూన్ 3న విడుదలైన ఆ చిత్రం రికార్డుస్థాయి వసూళ్లను రాబడుతూ, ఇప్పటికి థియేటర్లలో రన్ అవుతుంది.
తాజాగా కమల్ ఒక అరుదైన గౌరవాన్ని పొందినట్టు తెలుస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కమల్ కు గోల్డెన్ వీసా ను బహుకరించింది. ఈ అరుదైన గౌరవాన్ని అందించినందుకు కమల్ దుబాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలియజేసారు.
కళలు, పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్‌, విద్య వంటి పలు రంగా ల్లో విశేషసేవలు అందిస్తున్న వాళ్లకు, వ్యాపారవేత్తలకు మాత్రమే యూఏఈ  ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది. దీని ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుడా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు వీలు కలుగుతుంది. 2019 నుంచి ఈ గోల్డెన్‌ వీసాలు మంజూరు చేస్తుందీ యూఏఈ ప్రభుత్వం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com